IBomma : బొమ్మ అంటే బొమ్మ కాదు.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన రవి

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి ముగిసింది

Update: 2025-11-29 12:53 GMT

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి ముగిసింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. అయితే ఈ మూడు రోజులల విచారణలో ఐబొమ్మ రవి తాను ఈ పేరును ఎందుకు పెట్టారన్న దానిపై పోలీసు విచారణలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ అని అనుకుని తాను ఆ పేరు పెట్టినట్లు పోలీసులకు తెలిపాడు. తాను విశాఖలో చదువుకుంటున్న రోజుల్లో సినిమాను బొమ్మ గా పిలిచేవారమనిఆ పదాన్నే తన వెబ్ సైట్ కు వినియోగించానని ఐ బొమ్మ రవి పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఈ పేరు కూడా త్వరలో యువకుల్లోకి వెళ్లడంతోఎక్కువ మంది యూజర్లు కనెక్ట్ అయ్యారని తెలిపాడు. మరికొన్ని కీలక విషయాలపై కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

బ్యాంకు అకౌంట్ల వివరాలను...
మరొకవైపు ఐబొమ్మ రవికి సంబంధించిన అకౌంట్ల వివరాలను కూడా పోలీసులు ఈ విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల విషయంలోనూ రవి స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పోలీసు కస్టడీకి ఐదు రోజులు తీసుకున్న సమయంలో ఐ బొమ్మ రవి తనకు గుర్తు లేదు.. మర్చిపోయానని మాత్రమే చెప్పాడు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు తనకు గుర్తు లేదని ఐబొమ్మ రవి అంతకు ముందు కస్టడీ విచారణలో చెప్పాడు. కానీ ఈసారి పోలీసులు బ్యాంకు లావాదేవీలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. దీంతో పాటు కరేబియన్ దీవుల్లో ఉన్న వారి వివరకాలను కూడా పోలీసులు అడిగేందుకు ప్రయత్నించారు.
కరేబియన్ దీవుల్లో ఉన్న...
కరేబియన్ దీవుల్లో ఉన్న ఐబొమ్మ కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు? వారి వివరాలు ఏంటని రవిని అడిగినా సరైన రీతిలో స్పందించలేదని తెలిసింది. వారు భారత్ కు చెందిన వారు కాదని, ఇతర దేశాలకు చెందిన వారిని తాను ఉద్యోగులుగా నియమించుకున్నానని రవి పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం తాను ఎవరికీ అందుబాటులో లేనని కూడా రవి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అక్కడ ఆఫీసు కూడా క్లోజ్ అయిందని భావిస్తున్నట్లు రవి వెల్లడించినట్లు సమాచారం. మరొకవైపు ఐబొమ్మతో పాటు మరొక వెబ్ సైట్ కు బలపం అని పేరు పెట్టాలనుకున్నానని, కానీ డొమైన్ లో ఎల్ టెక్నికల్ సమస్యతో ఇబ్బంది రావడంతో బప్పంగా ఆ వెబ్ సైట్ కు పేరు పెట్టానని రవి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.రవిని నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడకు పోలీసులు తరలించారు.






Tags:    

Similar News