Hydraa : ఐదంతస్థుల భవనం కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. మియాపూర్ లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్థుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Update: 2025-11-01 06:06 GMT

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. మియాపూర్ లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్థుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బాహుబలి బుల్ డోజర్ తో వచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మియాపూర్ లోని సర్వే నెంబరు 100 లో వెలిసిన భారీ అక్రమనిర్మాణాన్ని ఉదయం నుంచి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.

అక్రమంగా నిర్మించిన...
మియాపూర్ లో అక్రమంగా నిర్మించిన భవనంపై కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. రోజు వారీ ఫిర్యాదుల్లో భాగంగా అందిన మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు. హెచ్ఎండీఏ ఫెన్సింగ్ ను తొలగించి ఆక్రమణదారులు కొందరు నిర్మాణాన్ని చేటప్టారు. దీంతో ఈరోజు ఉదయం హైడ్రా అధికారులతో పాటు హెచ్ఎండీఏ అధికారులు కూడా అక్కడకు వచ్చారు. భారీగా బందోబస్తు నిర్వహించారు. ఐదంతస్థుల భవనాన్ని కూల్చివేశారు.


Tags:    

Similar News