హైదరాబాద్ కు త్వరలోనే ఫ్రెంచ్ కాన్సులేట్

ఈ ఉదయం నేను ఈ విషయంలో భారతీయ విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను

Update: 2022-09-15 14:51 GMT

హైదరాబాద్ నగరంలో ఫ్రెంచ్ కాన్సులేట్ ను అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఫారెన్ మినిస్టర్ కేథరీన్ కొలోనా తెలిపారు. ఫ్రాన్స్ కు ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా నాలుగు కాన్సులేట్స్ ఉన్నాయి.. త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మాట్లాడుతూ "ఫ్రాన్స్ బ్యూరోను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నాము. ఇది చెన్నైలోని మా 4 కాన్సులేట్ జనరల్‌లకు, మా 15 అలయన్స్ లతో ముడిపడి ఉంటుంది. ఇకపై మీరు భారతదేశంలో ఎక్కడ నివసిస్తున్నా ఫ్రాన్స్ దూరంగా ఉండదు, " అని అన్నారు. బుధవారం న్యూ ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో కొలోనా ఈ విషయాన్ని తెలిపారు. ఫ్రాన్స్ భారతీయ విద్యార్థుల కోసం స్వాగతం పలుకుతూ ఉందని.. 2025 నాటికి 20,000 మంది విద్యార్థులను ఆహ్వానించబోతున్నామని మా దేశం ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆమె అన్నారు.

"ఈ ఉదయం నేను ఈ విషయంలో భారతీయ విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను.. ఫ్రాన్స్ మీ కోసం తలుపులు తెరిచి ఉంది. మీరు ఎక్కువ సంఖ్యలో ఫ్రాన్స్‌కు వచ్చి చదువుకోవాలని మేము కోరుకుంటున్నాము. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఫ్రాన్స్‌కు స్వాగతించే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్దేశించారు, "అని కొలోనా చెప్పుకొచ్చారు.
భారతదేశం రక్షణ భాగస్వాములలో ఒకటిగా ఫ్రాన్స్ ఉన్నందుకు గర్వపడుతున్నామని.. రెండు దేశాల సైన్యాలు ఇప్పుడు ఉమ్మడిగా గస్తీ నిర్వహిస్తున్నాయని అన్నారు. "రక్షణ రంగంలో ఫ్రాన్స్‌ తన అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పారిశ్రామిక పరంగానే కాకుండా కార్యాచరణలో కూడా భారతదేశ మొట్టమొదటి రక్షణ భాగస్వాములలో తాము ఒకరైనందుకు గర్విస్తున్నాము. మా సాయుధ దళాలు ఇప్పుడు ఉమ్మడి గస్తీని నిర్వహిస్తున్నాయి, ఇది ఒక పెద్ద ముందడుగు" అని ఆమె అన్నారు.


Tags:    

Similar News