Tarnaka Junction అక్కడికి వెళుతున్నారా.. ఆ జంక్షన్ మూసివేత

ఫ్లైఓవర్ క్రింద ఉన్న తార్నాక జంక్షన్‌ను మూసివేయాలని హైదరాబాద్

Update: 2025-06-05 15:16 GMT

జూన్ 6, శుక్రవారం నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం, లాలాపేట మధ్య వాహనాల రాకపోకల కోసం ఫ్లైఓవర్ క్రింద ఉన్న తార్నాక జంక్షన్‌ను మూసివేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. కొన్ని రోజుల పాటు ప్రయోగాత్మకంగా జంక్షన్ ను ఓపెన్ చేశారు ట్రాఫిక్ అధికారులు. అయితే దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగినట్టుగా తమ పరిశీలనలో తేలిందని అధికారులు స్పష్టం చేసారు. జూన్ 6 నుండి మూసివేత అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు అధికారులు.

జంక్షన్ మూసివేతతో మళ్ళీ పూర్వ పద్ధతితో జంక్షన్ దాటడానికి యూ టర్న్ లు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు. ఏప్రిల్ 18న ట్రయల్ రన్ కోసం జంక్షన్ తెరిచిన తర్వాత సిమ్యులేషన్ అధ్యయనాలు, డ్రోన్ అధ్యయనం, గూగుల్ డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News