Hyderabad : హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు
హైదరాబాద్ ను దట్టమైన పొగమంచు కప్పేసింది
హైదరాబాద్ ను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయం నుంచి పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అనేక విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా నగరంలో పొగమంచు వీడలేదు. పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాహనాల రాకపోకలకు...
ఉదయం ఎనిమిది గంటల వరకూ పొగమంచు వీడకపోవడంతో తమకు ఎదురుగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పొగమంచు ఈ స్థాయిలో ఉండటంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ విమానాల రాకపోకలకు ఇబ్బందులుగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.