హైదరాబాద్ పాతబస్తీలో ‘ఆపరేషన్ కవచ్’
హైదరాబాద్ పాతబస్తీలో ‘ఆపరేషన్ కవచ్’ ను పోలీసులు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్ పాతబస్తీలో ‘ఆపరేషన్ కవచ్’ ను పోలీసులు నిర్వహిస్తున్నారు. పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో బుధవారం రాత్రి పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించారు. ఈ తనిఖీలు పూరానాపూల్ ప్రాంతంలో చేపట్టారు. వాహనాలను తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద రీతిలో సంచరించేవారిని ప్రశ్నించారు.
సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా
సంఘ వ్యతిరేక శక్తులను నియంత్రించడం, అక్రమ వస్తువులు స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన ట్యాక్స్ లు చెల్లించకపోవడంతో పాటు ఇతరుల పేర్లపై ఉన్న వాహనాలాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.