Hyderabad : తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిరోజులొచ్చినట్లే.. పోలీసుల కీలక నిర్ణయం
Hyderabad : తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిరోజులొచ్చినట్లే.. పోలీసుల కీలక నిర్ణయం
తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. ఐ బొమ్మ, బప్పం టీవీలను పూర్తిగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించి అతని చేతనే ఈ సైట్ ను మూసివేయించారు. ఈ వెబ్ సైట్ ద్వారా కొత్త సినిమాలు వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్షం కావడంతో థియేటర్లకు రావడం ప్రేక్షకులు తగ్గించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిని సినిమాను క్షణంలో ఇమ్మడి రవి ఐ బొమ్మలో చూపుతుండటంతో భారీగా నష్టం వస్తుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్ పల్లిలో ఉన్న ఇమ్మడిరవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కరేబియన్ దీవుల్లో ఉంటూ...
కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ పనికి పాల్పడుతున్నాడు. శనివారం కూకట్ పల్లి వచ్చారని తెలిసిన సీసీఎస్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు అతని నుంచి మూడు కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వందల కొద్దీ హార్డ్ డిస్క్ లు, ల్యాప్ ట్యాప్ లు, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి కుమార్ స్వస్థలం విశాఖపట్నం. సైబర్ సెక్యూరిటీ ఎనాలిస్ట్, ఎథికల్ హ్యాకర్ గా చదువుకున్నారు. ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెల 37 లక్షల మంది వీక్షిస్తున్నారు. పైరసీ వెబ్ సైట్ లలో ఐ బొమ్మ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. తన సంపద అంత ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా వచ్చే ఇల్లీగల్ బెట్టింగ్స్ యాడ్స్, ప్రమోషన్స్ ద్వారానే ఇప్పటి వరకు పలు ఇల్లీగల్ బెట్టింగ్ సంస్థల నుండి వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్టు సమాచారం.
పోలీసులకు సవాల్ విసిరి...
గతంలో పలు రాష్ట్రాలలో జరిగిన సైబర్ కేసులను సైతం ఇతని ద్వారానే పలు సైబర్ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్ట్ లో హాజరుపరిచారు. తదుపరి విచారణకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇమ్మడి రవి తండ్రి అప్పారావు మాత్రం అతను చేసిన పనిని తప్పు పట్టారు. రవి సినిమాల్ని పైరసీ చేస్తున్న విషయం తనకు తెలియదని ఆయన తండ్రి చిన అప్పారావు తెలిపారు. రవి నేరం చేయలేదని తాను చెప్పనని, పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందేనని అన్నారు. అతను ఇంటికి వచ్చి రెండేళ్లవుతోందని, పోలీసులకు సవాల్ విసిరితే ఊరుకుంటారా? అది తప్పు. రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప ఉంది. భార్యా భర్తల మధ్య విభేదాలు ఉన్నాయని అప్పారావుతెలిపారు. భార్యా భర్తలు మధ్య ప్రస్తుతం కలసి ఉండటం లేదని తెలిసిందన్నారు.