హైదరాబాద్ లో ప్రధాన పార్కులన్నీ మూసివేత

ప్రేమికుల రోజున ప్రేమికులంతా పార్కుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అందుకే నగర పోలీసులు హైదరాబాద్ లోని ప్రధాన..

Update: 2022-02-14 07:07 GMT

హైదరాబాద్.. ఈ నగరంలో ప్రేమికులు సందర్శించేందుకు లెక్కలేనన్ని పార్కులున్నాయి. మామూలు రోజుల్లోనే ప్రేమికులతో పార్కులు నిండిపోతాయి. ఇక వాలెంటైన్స్ డే రోజు పార్కులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికుల రోజున ప్రేమికులంతా పార్కుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అందుకే నగర పోలీసులు హైదరాబాద్ లోని ప్రధాన పార్కులన్నింటినీ మూసివేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. వాలెంటైన్స్ డే రోజు పార్కుల్లో ఎలాంటి చెడు సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముందుగా ఇందిరా పార్కును మూసివేశారు పోలీసులు. మరోవైపు భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికులు కనిపిస్తే.. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఫిబ్రవరి 14న జరుపుకోవాల్సింది ప్రేమికుల రోజు కాదని, దేశం కోసం పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, వారికి నివాళులు అర్పించాలని వివరిస్తున్నారు. అలాగే.. భజరంగ్ దళ్ పేరుతో.. వాలెంటైన్స్ డే రోజు కనిపించిన ప్రేమికులందరికీ పెళ్లిళ్లు చేస్తున్నారని, నిజమైన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఎప్పటికీ అలా చేయరని తెలిపారు. వాలెంటెన్స్ డే సందర్భంగా నగరంలోని పార్కుల వద్ద పోలీస్ లు పికేట్స్ నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News