Hyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పది విమానాలు రద్దు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పది విమాన సర్వీసులు రద్దయ్యాయి
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు అంతర్జాతీయ మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల వల్ల కొన్ని ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం. రద్దైన సర్వీసుల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాత్కాలికంగా రద్దు...
విమానాశ్రయ అధికారులు ప్రయాణికులు తమ తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితులను బట్టి మరికొన్ని సర్వీసుల షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో అనేక విమానాశ్రయాలు మూసివేయడంతో ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని, గల్ఫ్ దేశాలకు విమానాలను నడపటం లేదని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.