Gold Rates : భగ్గుమన్న బంగారం ధరలు .. ఒక్కరోజే ఇంతా?

బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగదల కనిపించింది

Update: 2026-02-28 06:46 GMT

బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగదల కనిపించింది. నిన్నటి వరకూ బంగారం, వెండి ధరలు కొంత తగ్గుతూ, ఎక్కువ రోజులు స్థిరంగా కొనసాగాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. వెండి ధరలు కూడా వేలల్లో పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై మూడు వేల రూపాయలు పెరిగింది.

మూడు లక్షలు టచ్ చేసిన వెండి ధరలు...
కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,51,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,64,730 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర మూడు లక్షల రూపాయలను టచ్ చేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఒక్కసారిగా ధరలు పెరగడంతో కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News