గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు నమోదు.. కానిస్టేబుల్ ను బ్యానెట్ పై ఉండగానే?

గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది

Update: 2026-03-02 06:17 GMT

గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొని కారుతో పాటు డ్రైవర్ ఈడ్చుకెళ్లారు. అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి వచ్చిన గుర్రంపాటి తరుణ్‌ తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నాడు. అనంతరం బెంజ్ కారులో నార్సింగి బయలుదేరాడు. అయితే ఇలా వస్తున్న తరుణంలో నానక్‌రాంగూడ వద్ద ఓ కారును ఢీ కొట్టి..ఆపకుండా తరుణ్ వెళ్లాడు.

కారును ఆపేందుకు...
గచ్చిబౌలి వద్ద కారును ఆపేందుకు పోలీసుల ప్రయత్నం చేశారు. కారును కానిస్టేబుల్‌ పైకి డ్రైవర్ పోనిచ్చారు. దీంతో కారు బ్యానెట్‌పై పోలీసు పడ్డారు. అయినా కారు ఆపకుండా దాదాపు కిలోమీటర్ దూరం తరుణ్ తీసుకెళ్లాడు. చివరికి డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పర్చడంతో పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించారు.


Tags:    

Similar News