Gold Price Today : పసిడి ప్రియులకు భారీ ఊరట.. ఇప్పుడే కొనండి

ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి

Update: 2026-02-28 03:49 GMT

పసిడి ప్రియులు బంగారాన్ని ఎప్పుడెప్పుడు కొనుగోలు చేయాలా? అని చూస్తుంటారు. అందులో మహిళలు మరింత మక్కువ చూపుతుంటారు. అయితే బంగారం ధరల్లో హెచ్చు తగ్గుదలలు కొనుగోలు చేసే వారిని కొంత ఆగేలా చేస్తున్నాయి. ఇంకా బంగారం తగ్గుతుందని కొందరు.. కొంత కాలం వెయిట్ చేస్తే మరింత దిగివస్తాయని భావిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అందుకే మరింత తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. అందులో చాలా మంది ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే వాయిదా వేసుకోవడం మంచిదన్న భావన ఎక్కువ మందిలో కనిపిస్తుంది

పెళ్లిళ్ల సీజన్ రావడంతో...
బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో మండిపోతున్నాయి. ధరల పెరుగుదలకు అనేక కారణాలు కనిపిస్తున్నప్పటికీ బంగారం పూర్తిగా ఇంకా అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలన్నది ఎక్కువ మంది ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయినప్పటికీ బంగారం, వెండి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు తెలిపారు. అయితే రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని, ఇప్పుడే అవసరమున్న వారు కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మార్చి నెలలో ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. మరో నాలుగైదు నెలలు శుభముహూర్తాలు ఉండనున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు కూడా పెరుగుతాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు అంచనా వేస్తున్నారు. కొత్త స్టాక్ ను తెప్పించి నూతన డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర పై ఐదు వందల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,110 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,580 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,94,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News