Thu Jan 29 2026 16:28:51 GMT+0000 (Coordinated Universal Time)
మహబూబాబాద్ లో పోక్సో కోర్టు.. బాధితులకు నేరుగా న్యాయం చేసేలా..
గిరిజనులు, ఆదివాసీ తండాల్లోని చిన్నారులపై లైంగిన దాడులు చేసి.. చాలా మంది నిందితులు తప్పించుకుంటున్నారు. అలాంటి నేరాలకు.

చిన్నారులపై కన్నేసి, వారి జీవితాలను తమ కామ కోరికలతో చిదిమేస్తున్న మృగాళ్లను కఠినంగా శిక్షించేందుకు మహబూబాబాద్ జిల్లాలో పోక్సో కోర్టును ఏర్పాటు చేసింది న్యాయవ్యవస్థ. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉండేది గిరిజన, ఆదివాసీలే. ఇక్కడి గిరిజనులు, ఆదివాసీ తండాల్లోని చిన్నారులపై లైంగిన దాడులు చేసి.. చాలా మంది నిందితులు తప్పించుకుంటున్నారు. అలాంటి నేరాలకు చెక్ పెడుతూ.. నేరం చేసి తప్పించుకుంటున్న నేరస్తులను నేరుగా శిక్షించేందుకు మహబూబాబాద్ లో కోర్టును ఏర్పాటు చేశారు. ఆదివాసీ తండాలకు అండగా నిలిచేందుకు న్యాయవ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బాధితులు ఎవరికీ భయపడకుండా.. నేరుగా న్యాయమూర్తికి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేలా ఏర్పాట్లు చేసింది. చూడడానికి అది కోర్టు లా కాకుండా.. కార్పొరేట్ స్కూల్లా కోర్టు కన్పిస్తుంది. బాధితులు, వాళ్ల బంధువులు కూర్చేనేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌తో కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించారు. చిన్నారులపై అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పోక్సో కోర్టును ఏర్పాటు చేసింది.
News Summary - POCSO Court Established in Mahabubabad District
Next Story

