Gold Prices Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2026-02-27 03:35 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ కొద్దిగా పతనం దిశగా పయనమయిన బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగు అందుకోవడంతో పెళ్లిళ్ల సీజన్ సమయంలో కొనుగోలు చేయడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగుతుండటంతో ధరల అదుపు అనేది సాధ్యం కాదన్నది ఇక అర్థమయింది. అందుకే అవసరమైనంత మేరకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేయడం తప్పని సరి కావడంతోనే మొక్కుబడిగా కొంటున్నామని కూడా అంటున్నారు.

ధరలు తగ్గాలని...
బంగారం, వెండి ధరలు తగ్గాలని కేవలం వినియోగదారులు మాత్రమే కాదు.. జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా కోరుకుంటున్నారు. అమ్మకాలు పెరగాలంటే ధరలు అందుబాటులోకి రావాలని చెబుతున్నారు. కానీ గత పదిహేను నెలల నుంచి బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అమ్మకాలు దాదాపుగా పడిపోయాయి. దుకాణాల నిర్వహణ కూడా కష్టంగా మారిందంటున్నారు. మరికొందరు ఉన్న బంగారం, వెండి వస్తువులను మంచి ధర రావడంతో విక్రయిస్తుండటంతో ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కూడా ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.
పెట్టుబడి పెట్టిన వారు...
మరొకవైపు ధరలు పెరగాలని పెట్టుబడి పెట్టినవారు కోరుకుంటున్నారు. తమకు లాభాలు రాకపోయినా పరవాలేదు కానీ, భారీగా నష్టం రాకూడదనుకుంటే మరికొంత ధరలు పెరగాలని మదుపు చేసిన వారు ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 1,600 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,47,590 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,010 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,94, 900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News