Gold Prices Today : యుద్ధం ఎఫెక్ట్... అయినా పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి.
బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచానాల నేపథ్యంలో కొంత ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బంగారం, వెండి ధరలు కొంత దిగి వస్తున్నాయి. యుద్ధం కారణంగా పెరగాల్సిన ధరలు తగ్గుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. యుద్ధం ప్రారంభమయిన వెంటనే ధరలు పెరిగాయి. అయితే ఆ తర్వాత రెండు రోజుల నుంచి ధరలు దిగి వస్తున్నాయి. దీంతో ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం పసిడి, వెండి ధరలపై పడలేదని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరొకవైపు డిమాండ్ కూడా పెరిగిందంటున్నారు.
మరింత తగ్గుతాయని...
బంగారం ధరలు మరింత పెరుగుతాయని ముందు నుంచి అంచనాలు వినపడుతున్నాయి. గత ఏడాది ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది కూడా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో బంగారం, వెండి ధరలు చుక్కలు అంటాయి. మార్చి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు ఇంకా పెరుగుతాయని భావించారు. కానీ ధరలు దిగి రావడం శుభపరిణామమేనని అంటున్నారు. బంగారం,వెండి ధరలు పెరగకపోవడంతో వాటిని కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. మరికొంత కాలం ధరలు తగ్గితే ఈ పెళ్లిళ్ల సీజన్ తమకు కలసి వస్తుందని వ్యాపారులు సంబరపడిపోతున్నారు.
ధరలు తగ్గి...
ధరలు తగ్గుతుండటంతో పెట్టుబడి పెట్టిన వారు తమ మదుపు చేసిన మొత్తాన్ని వెనక్కు తీసుకుంటు న్నారు.మొన్నటివరకూ ధరలు పెరగడం, యుద్ధం ప్రారంభం కావడంతో ధరలు పెరుగుతాయని ఇంకా పెట్టుబడులు పసిడి,వెండిపై అలాగే ఉంచిన కొందరు మాత్రం నిరాశకు లోనవుతున్నారు.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర1,53,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,67,610 రూపాయలకు వద్ద నమోదయింది. కిలో వెండి ధర 3,14,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మరికాసేపట్లో ధరల్లో మార్పులుండవచ్చు.