Hyderabad : కోట్ల రూపాయల ఆస్తి బూడిద..నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం

నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది

Update: 2026-03-04 03:01 GMT

నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు దగ్దమయ్యాయి. ఫర్నిచర్ షాపు నుంచి మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు దుకాణాలు పూర్తిగా దగ్దమయ్యాయి. అయితే పక్కన ఉన్న ట్రాన్సాఫార్మర్ నుంచి మంటలు వ్యాపించి దుకాణాలకు అంటుకున్నాయని వ్యాపారులు చెబుతున్నాు.

దుకాణాలకు మంటలు అంటుకుని...
మంటలు ముందుగా ఓ ఫర్నిచర్ దుకాణంలో ప్రారంభమైనట్లు సమాచారం. అక్కడి నుంచి సమీప దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు వ్యాపారులు తెలిపారు. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News