Hyderabad : ఢిల్లీ పేలుడు ఘటనతో నేడు కూడా హైదరాబాద్ లో తనిఖీలు

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Update: 2025-11-11 03:20 GMT

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా నేడు కూడానగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఉండే రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేశారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్లు మరియు రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు.

లాడ్జీలు, హోటళ్లు...
మెటల్ డిటెక్టర్లు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి, అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో పాటు కార్గో సర్వీస్ సెంటర్‌లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలించి, పంపబడుతున్న పార్శిళ్ల వివరాలను నమోదు చేసుకున్నారు.


Tags:    

Similar News