న్యూఇయర్‌ ఈవెంట్లపై సీఎం రేవంత్ సీరియస్.. వారిపై కేసు నమోదు

Update: 2023-12-25 11:26 GMT

Hyderabad New Year Events

ఇక ఈ ఏడాది మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కొత్త సంవత్సరాలో రకరకాల ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. డిసెంబర్‌ 31 రాత్రి నుంచి ఈవెట్లు నిర్వహిస్తుంటారు. అయితే కొత్త సంవత్సరానికి ఈవెట్లకు సిద్ధమవుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. న్యూఇయర్‌కు ఈవెంట్లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు. ఈవెంట్లు నిర్వహించే సన్‌బర్న్‌, బుక్‌మైషో వంటి సంస్థలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్‌ సీపీ మహంతి సూచించారు. సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, బుక్‌ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు చెప్పారు. అనుమతి లేకుండా టిక్కెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవు సీపీ మహంతి అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం:

ఇదిలా ఉండగా, న్యూ ఇయర్‌ వేడుకలకోసం నిర్వహించే ఈవెంట్లపై ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు , ఎస్పీల సమావేశంలో చర్చించారు. ఈవెంట్ల నిర్వహనపై సీఎం సీరియస్‌ అయ్యారు. ఈవెంట్ల నిర్వహణ, అనుమతులపై పోలీసు అధికారులకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం. ఈవెంట్ల కోసం టికెట్ల విక్రయంపై అనుమతులు ఎందుకు ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. న్యూఇయర్‌కు అనుమతులు లేనిదే ఈవెంట్లు నిర్వహించేది లేదని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

కాగా సన్‌బర్న్ అనేది భారీ స్థాయిలో నిర్హహించే సంగీత వేడుక. పలు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. ఈ వేడుల్లో మద్యం అనుమతి ఉంటుంది. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వేడుకల్లో డ్రగ్స్ వినియోగించే ఛాన్స్ ఉందని.. అనుమతులపై కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. ఇలాంటి వేడుకలపై కఠినంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

బుక్‌మై షోపై కేసు నమోదు

సన్ బర్న్ షోకు టిక్కెట్లు విక్రయించిన బుక్ మై షో పై మాదాపూర్ పీఎస్‌లో కేస్ నమోదు అయ్యింది. సన్‌బర్న్‌కు అనుమతులు లేకుండానే బుక్ మై షో టికెట్లు విక్రయించినందుకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు సన్ బర్న్ షో కు అనుమతి ఇవ్వనీ సైబరాబాద్ పోలీసులు.. బుక్‌మై షో, సన్‌బర్న్‌ షో నిర్వాహకులపై కేసు నమోద చేశారు.

Tags:    

Similar News