Rain Alert : నేడు హైదరాబాద్ లో భారీ వర్షం
నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
Ap weather updates
నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా బలంగా వీస్తాయని తెలిపింది. గంటలకు 30 నుంచి నలభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.