హైదరాబాద్ భూములకు భారీ బ్రేక్.. ఎకరా ఎంతో తెలుసా?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. రాయిదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది

Update: 2025-10-07 05:56 GMT

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. రాయిదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో గతంలో ఎన్నడూ అమ్మకాలు జరగలేదని తెలిసింది. అయితే ఒక్కొక్క ఎకరా ఎంఎన్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ 177 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

177 కోట్ల రూపాయలు...
టీజీఐఐసీ వేసిన వేలంలో ఒక్కొక్క ఎకరా 177 కోట్ల రూపాయలు వెచ్చించి వేలంలో 7.67 ఎకరాలను దక్కించుకున్న ఎమ్ఎస్ఎన్ ఇక్కడ భారీగా అపార్ట్ మెంట్లను నిర్మించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గంంలో నియో పోలిస్ కొనుగోలు చేసిన భూముల కంటే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అధికార వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News