Hyderabad : హైదరాబాద్ - గోరఖ్ పుర్ రైలు రద్దు

హైదరాబాద్ - గోరఖ్ పుర్ మధ్య నడిచే రైలు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు

Update: 2025-10-18 01:48 GMT

హైదరాబాద్ - గోరఖ్ పుర్ మధ్య నడిచే రైలు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. నవంబరు 28వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకూ హైదరాబాద్ - గోరఖ్ పుర్ రైలును రద్దు చేస్తున్నట్లు చెప్పారు. నవంబరు 28వ తేదీ నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండదని తెలిపారు.

ప్రత్యేకరైళ్లు మాత్రం...
హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి అక్టోబరు 23వ తేదీ నంుచి నవంబరు 27వ తేదీ వరకూ ప్రతి గురువారం ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలాగే బెళగావి నుంచి హైదరాబాద్ కు ఈ రైలు అక్టోబరు 24వ తేదీ నుంచి నవంబరు 28వ తేదీ వరకూ శుక్రవారం ప్రత్యేక రైలు బయలుదేరనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి కి అక్టోబరు 21వ తేదీ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు


Tags:    

Similar News