నేడు పరేడ్‌గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
నేడు పరేడ్‌గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది
నేడు పరేడ్‌గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. రెండోరోజు జరగనున్న ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. పరేడ్ గ్రౌండ్స్ లో గత కొన్ని రోజుల నుంచి కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ కు భారీ స్పందన లభించింది. అయితే నిన్నటి నుంచి హట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమయింది.
గచ్చిబౌలిలో డ్రోన్ ఫెస్టివల్...
నేడు కూడా పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. ఆన్‌లైన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ టికెట్ల అమ్మకం జరగనుంది. హాట్ బెలూన్ లో పర్యటించి హైదరాబాద్ నగరాన్ని వీక్షించే అవకాశం కలుగుతుంది. మరొకవైపు గచ్చిబౌలి స్టేడియంలో రెండోరోజు డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.