Hyderabad : హైదరాబాద్ లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అరగంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అరగంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, లక్డీకాపూత్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు విడిచిపెట్టే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు ప్రాంతాలు...
అరగంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నగరంలో పలు ప్రాంతాలు నీటిమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు వినాయక మంటపాల్లోకి కూడా వర్షపు నీరు చేరే అవకాశముండటంతో నిర్వాహకులు వాటిని బయటకు తోడేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న చోటకు ఎవరూ రావద్దని ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు సూచిస్తున్నారు.