Hyderabad : హైదరాబాద్ లో కాల్పుల కలకలం
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ కాల్పులు జరిగాయి
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ కాల్పులు జరిగాయి. రెండువర్గాల మధ్య స్థల వివాదంలో తలెత్తిన ఘర్షణ ఈ కాల్పులకు కారణమని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ నేత సోదరుడికి, తెలంగాణలో మాజీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడికి మధ్య భూ వివాదం ఉందని తెలిసింది. ఆ నేత అనుచరులు కూడా ఆక్రమణ దారుడిని బెదిరించడంతో వారు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
గన్ తో బెదిరించి...
స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని గన్ తో బెదిరించడంతో అతను వినకపోవడంతో కాల్పులు జరిపినట్లు తెలిసింది. అయితే కాల్పుల ఘటనలో ప్రమాదం జరిగిందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారని చెబుతున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవర్గం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.