Hyderabad : హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టే సెంటర్ ప్రారంభం
హైదరాబాద్ లో గూగుల మరో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గూగుల్ సేఫ్టీ సెంటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
హైదరాబాద్ లో గూగుల మరో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గూగుల్ సేఫ్టీ సెంటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆసియా - పసిఫిక్ లోనే మొట్టమొదట గూగుల్ సేఫ్టీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలకు అడ్రస్ గా మారిందని తెలిపారు.
ఆసియా -ఫసిఫిక్ లోనే...
జీవితమంతా డిజిటల్ తో ముడిపడి ఉందని, డిజిటల్ సేఫ్టీ ఫస్ట్ అన్న నినాదంతో ప్రపంచం ముందుకు వెళుతున్న వేళ ఇటువంటి సేఫ్టే సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. గూగుల్ ఆవిర్భావం నుంచి ప్రపంచమే మారిపోయిందని రేవంత్ రెడ్డిఅన్నారు. గ్లోబల్ కంపెనీలకు హైదరాబదాద్ ఫస్ట్ ఛాయిస్ అని అన్నారు. ఈ సందర్భంగా గూగుల్ సేఫ్టీ సెంటర్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిబ్బంది వివరించారు.