Hyderabad : నేడు గచ్చి బౌలి ఫ్లై ఓవర్ ప్రారంభం.. తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ

గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫైజ్ 2 ఫ్లై ఓవర్ నేడు ప్రారంభానికి సిద్దమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు

Update: 2025-06-28 02:01 GMT

హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పెరిగిపోతున్న జనాభా, వాహనాల సంఖ్యతో నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మిస్తూ వస్తున్నాయి. అయినా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అయినా సరే కొన్ని ట్రాఫిక్ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లై ఓవర్లను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ ను కొద్ది వరకూ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా...
ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా కొన్ని ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. తాజాగా గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫైజ్ 2 ఫ్లై ఓవర్ నేడు ప్రారంభానికి సిద్దమయింది. 182 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్లై ఓవర్ ను 1.2 కిలోమీటర్ పొడవున నిర్మించారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకూ వెళ్లే వారికి  సులువు ప్రయాణం లభిస్తుంది.  నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. దీంతో నేటి నుంచి నగరవాసులకు ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. సిగ్నల్ ఫ్రీ ప్రయాణమే లక్ష్యంగా నగరవాసులు సలువుగా ప్రయాణం చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ఫ్లై ఓవర్ కు పీజేఈర్ ఫ్లై ఓవర్ గా నామకరణం చేశారు.
రెండు నిమిషాల్లోనే...
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద వాహనాల రద్దీ చాలా వకూ తగ్గుతుంది. 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు నిమిషాల్లోనే చేరుకునే అవకాశముంది. ప్రయాణికులుకు నేటి నుంచి అందుబాటులోకి రానుంది. నగరంలో మొత్తం నలభై రెండు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 36 ప్రాజెక్టులను పూర్తి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన ప్రాంతాల్లో నిర్మించిన ఫ్లై ఓవర్ లు ఒక్కొక్కటి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫేజ్ 2 ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.


Tags:    

Similar News