పెట్రోల్ దొరకదేమో అనే టెన్షన్ వద్దు

పెట్రోల్‌, డీజిల్‌ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి

Update: 2024-01-02 12:18 GMT

ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను విరమించారు. పెట్రోల్‌, డీజిల్‌ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది. దీనికి నిరసనగా ఆయిల్‌ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు జనవరి 1 నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్‌ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా జనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌లు అయ్యాయి. ఆయిల్‌ ట్యాంకర్లు ధర్నా విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. కమిషన్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇక పెట్రోల్ ట్యాంకర్ యజమానులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో బంకులలో పెట్రోల్, డీజిల్ లేదంటూ ఇప్పుడే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సమ్మె విషయం తెలిసిన వాహనదారులు ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు.


Tags:    

Similar News