Ys Jagan : విచారణ పూర్తి చేసుకున్నజగన్ లోటస్ పాండ్ కు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ కు హాజరయిన సందర్భంలో పెద్ద సంఖ్యలో అభిమానులు న్యాయస్థానానికి చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ ముగియడంతో మరికాసేపట్లో జగన్ కోర్టు నుంచి బయటకు రానున్నారు.
సీబీఐ కోర్టు వద్ద...
నేరుగా అక్కడి నుంచి లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్లే అవకాశముంది. దాదాపు ఆరేళ్ల తర్వాత వైఎస్ జగన్ న్యాయస్థానానికి హాజరయ్యారు. న్యాయస్థానం ఆదేశాలతో వైఎస్ జగన్ న్యాయస్థానాినికి హాజరయ్యారు. నాంపల్లికోర్టు నుంచి జగన్ బయలుదేరడంతో ఆయన వెళ్లే మార్గంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పెద్దయెత్తున వైసీపీ అభిమానులు తరలి వచ్చారు.