Hyderabad : రద్దయిన విమానాలివే.. కొన్ని దారి మళ్లింపు
హైదరాబాద్ లో పొగమంచు ఇబ్బంది పెడుతుంది
హైదరాబాద్ లో పొగమంచు ఇబ్బంది పెడుతుంది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు ఏర్పడటంతో విమానాలను కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడుపుతున్నారు. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొగమంచుతో...
వచ్చే నెల పదో తేదీ వరకూ పొగమంచు ఉంటుందని డీజీసీఏ హెచ్చరించింది. దాదాపు పద్దెనిమిది జాతీయ, అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించినట్లు విమాన యాన శాఖ అధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు ఉండటంతో ల్యాండింగ్ కు కూడాఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. పొగమంచు తగ్గిన తర్వాత విమానాలు టేకాఫ్ చేయాలని నిర్ణయించారు.