India Vs Bangladesh : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్ నేడు

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య తొలి మ్యాచ్ నేడు జరగనుంది.

Update: 2025-02-20 01:53 GMT

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య తొలి మ్యాచ్ నేడు జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. చిన్న జట్టు అని తీసిపారేయడానికి లేదన్న క్రీడా నిపుణుల సూచనతో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేలా ఆడాల్సి ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా రెండేళ్ల క్రితం తమ దేశంలో వన్డే సిరీస్ ను గెలుచుకున్న ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగుతున్నారు.

వర్షం అడ్డంకిగా మారుతుందా?
అయితే మ్యాచ్ కు వర్షం అడ్డింకిగా మారే అవకాశముందన్న వాతావరణ సూచన కొంత కలవరపరుస్తున్నా దానిని అధిగమించి ఎన్ని ఓవర్లు ఆడినా పరుగులు అధికంగా చేసి ప్రత్యర్థి బంగ్లాజట్టుపై భారత్ ఒత్తిడి పెంచాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలని కూడా పిచ్ రిపోర్టుల చెబుతున్నాయి. స్పిన్నర్లు చేతికి పనిచెప్పి అత్యంత వేగంగా బంగ్లా బ్యాటర్లను దెబ్బతీయాలని చెబుతున్నారు. మొత్తం మీద తొలి మ్యాచ్ లో భారత్ ఆటతీరు ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News