Breaking : హైదరాబాద్ లో కాల్పులు కలకలం
హైదరాబాద్ లో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి
హైదరాబాద్ లో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. కోఠిలోని ఎస్.బి.ఐ ఏటీఎం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. రషీద్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం ఎస్.బి.ఐ ఏటీఎంలో ఆరు లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేయడానికి కోఠి ఎస్.బి.ఐ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ కు వచ్చారు.
ఎస్.బి.ఐ. ఏటీఎం వద్ద...
అతనిని అనుసరించి వచ్చిన కొందరు వ్యక్తులు రషీద్ పై కాల్పులు జరిపి ఆరు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో రషీద్ కాలికి గాయమయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రషీద్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలిసిన వారి పనేనన్న అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సీసీ టీవీ కెమెరాలను పరిశీలించే పనిలో పోలీసులున్నారు. సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.