Hyderabad : అగ్నిప్రమాదంలో మృతులు వీరే
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు కూడా చనిపోయినట్లు తెలిసింది. అభిషేక్ (30), ఆరూషీ జైన్ (17), హర్షాలీ గుప్తా (7) , శీతల్ జైన్ (37), రాజేందర్ (67), సుమత్రా( 65) , మున్నీభాయ్ (72) , సిరాజ్ (2) లుగా గుర్తించారు.
కిషన్ రెడ్డి ఘటనస్థలంలో...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రమాదస్థలికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి మాట్లాడారు. మంటలు, పొగ కారణంగా వీరంతా చనిపోయారని తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మొత్తం మూడు ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.