Hyderabad : హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో ఆరుగురు?

హైదరాబాద్ లో నాంపల్లిలోని ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది

Update: 2026-01-24 11:45 GMT

హైదరాబాద్ లో నాంపల్లిలోని ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నీచర్ దుకాణంలో చెలరేగిన మంటలతో ఆరుగురు చిక్కుకున్నారు.నాలుగు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ అగ్నిప్రమాదం జరిగింది. అయితే భవనంలో ఉన్న నలుగురితో పాటు మరో ఇద్దరు ఉన్నారని తెలిసింది.నాలుగు ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. బచాస్ ఫర్నిచర్ క్యసిల్ లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలతో పాటు ఒక తల్లి ఉన్నారని చెబుతున్నారు.

రోబోను పంపి మంటలను...
అయితే అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఒక రోబోను పంపి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. భవనంలో ఆరుగురున్నట్లు తెలిసింది. పొగ దట్టంగా ఎగిసిపడుతుంది. గోదాంలో పనిచేస్తున్న మూడు కుటుంబాలు ఇక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు. వాచ్ మెన్ లోని ఇద్దరు పిల్లలతో పాటు, మరో నలుగురు ఈ మంటల్లో చిక్కుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఘటనాస్థలిని పరిశీలించి సహాయకచర్యలు ప్రారంభించారు. అయితే లోపల చిక్కుకున్న వారిఆచూకీ ఇంత వరకూ తెలియరాలేదు.


Tags:    

Similar News