రంగారెడ్డి కలెక్టరేట్ లో మంచు మోహన్ బాబు
సినీనటుడు మంచు మోహన్ బాబు, మనోజ్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు.
సినీనటుడు మంచు మోహన్ బాబు, మనోజ్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. మంచు కుటుంబంలో తలెత్తిన ఆస్తుల విభేదాల నేపథ్యంలో ఇద్దరినీ నేడు విచారణకు పిలిపించారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు, మనోజ్ లు తమ వాదనలను వినిపించారు. అయితే మోహన్ బాబు మాత్రం సీనియర్ సిటిజన్ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితమే కలెక్టర్ ను లేఖలో కోరారు.
ఇరువర్గాల వాదనలు...
జల్ పల్లి గ్రామంలో తన ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించాడని ఆస్తులు కావాలని తనపై వత్తిడి తెస్తున్నాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీనిపై మనోజ్ కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇద్దరు తమ వాదనలను విన్న తర్వాత విచారణను కలెక్టర్ వాయిదా వేశారు. తాను ఆస్తులను ఆక్రమించుకోలేదని, తన తండ్రి అంటే తనకు గౌరవంతో పాటు ప్రేమ కూడా ఉందని మనోజ్ తెలిపారు.