నేడు సిగాచీ పరిశ్రమ వద్దకు నిపుణుల కమిటీ
నేడు పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదస్థలానికి నిపుణుల కమిటీ సందర్శించనుంది
నేడు పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదస్థలానికి నిపుణుల కమిటీ సందర్శించనుంది. పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి నలభై మంది కార్మికులు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. సిగాచి ప్రమాదస్థలాన్ని పరిశీలించనున్న కమిటీసభ్యులు పేలుడుకు గల కారణాలను తెలుసుకోనున్నారు.
నెలరోజుల్లో నివేదిక...
ప్రత్యక్షంగా పరిశ్రమ ను పరిశీలించడంతో పాటు బాధితులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రమాదంపై నలుగురు శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటుచేసిన సర్కార్ ప్రమాదానికి గల కారణాలు తెలియజేయాలని కోరింది. నెలరోజుల్లో ప్రభుత్వానికి ప్రమాదానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.