రేపు ఉప్పల్ స్టేడియంలో సూపర్ మ్యాచ్

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధం అయింది. ఈనెల 23న హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్ జరగనుంది

Update: 2025-03-22 03:21 GMT

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధం అయింది. ఈనెల 23న హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఆదివారం కూడా కావడంతో ఎక్కువ మంది స్టేడియానికి తరలి వచ్చే అవకావముంది.

అన్ని ఏర్పాట్లు పూర్తి...
అందుకే పోలీసులు ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్‌ ను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘాను ఏ్రపాటు చేశారు. ఈ మ్యాచ్ కోసం 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News