హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈడీ ఆరా
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫోకస్ పెట్టారు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫోకస్ పెట్టారు. స్టేడియం టెండర్ల నుంచి టికెట్లవిక్రయం వరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో దీనిపై విచారించాలని నిర్ణయించారు. గత పదేళ్లలో బీసీసీఐ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 800 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అకౌంట్‌ను సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు బలంగా వచ్చాయి. ఇప్పటికే దీనిపై తెలంగాణ సీఐడీ అధికారుల విచారణ చేస్తున్నారు.
అవకతవకల ఆరోపణలు...
బాల్స్,స్టేడియం చైర్స్,జిమ్ పరికరాల టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయింది.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోకి ఎంట్రీ కావడానికి జగన్మోహన్ రావు ఎవరెవరికీ ఎంత ఇచ్చారో అనే అంశంపై ఈడీ ఆరా తీసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల టెండర్ల విషయంలోనూ సొంతవాళ్లకే లాభం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఫుడ్ క్యాటరింగ్,స్టాల్స్ ,టికెట్స్ కేటాయింపులో తన వారికే టెండర్లు కేటాయించడంపై ఈడీ ఆరా తీయనుంది.