Hyderabad Accident : చుట్టపు చూపుగా వచ్చి మంటల్లో చిక్కుకుని?
వేసవి సెలవులకు బెంగాల్ నుంచి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డారు.
వేసవి సెలవులకు బెంగాల్ నుంచి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డారు. బంధువుల ఇంటికి వచ్చిన నాలుగు కుటుంబాలలో సభ్యులు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటనలో మరణించిన వారంతా బెంగాల్ వాసులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు నలుగుు మహిళలున్నారు. గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఉస్మానియా ఆసుపత్రి, ఒవైసీ ఆసుపత్రి, మలక్ పేట్ యశోద ఆసుపత్రిలో కొందరు చికత్స పొందుతున్నారు. వారిలో కొందరు మరణించగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బంధువులు ఇళ్లకు సెలవులకు వచ్చి అగ్నికి ఆహుతి అయ్యారు.
ప్రమాదానికి కారణం...
అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నారు. ముత్యాల వ్యాపారం చేస్తున్న తమ బంధువుల షాపు పైన నివాసం ఉండటంతో హాలులోనే ముప్ఫయి మంది పడుకున్నారు. కింద దుకాణం, పైన నివాసం ఉండటంతో ఒకే దారి ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకుని వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఎవరూ బయటకు రాలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పదహారు మంది వరకూ రక్షించగలిగారు. వారిని బయటకు తేగలిగారు. ఉదయం ఆరు గంటలకు ప్రమాదం జరిగిందని వార్త తెలిసిన వెంటనే పదిహేను నిమిషాల్లో అగ్ని ప్రమాద శాఖకు చెందిన సిబ్బంది చేరుకుని సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎక్కువ మంది...
మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరు మంటలు వ్యాపించిన వెంటనే బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో సజీవదహనమయ్యారు. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో 67 ఏళ్ల రాజేంద్ర కుమార్, ముప్ఫయేళ్ల అభిషేక్ మోదీ, అరవై అయిదేళ్ల సుమిత్ర, డెబ్భయి రెండేళ్ల మున్సీబాయి, పదిహేడేళ్ల ఆరుషి జైన్, ముప్ఫయి ఏడేళ్ల శీతల్ జైన్, రెండేళ్ల ఇరాజ్, ఏడేళ్ల హర్షాలీ గుప్తా, రజనీ అగర్వాల్, అన్యమోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇదిక్కి మోదీ, రిషబ్, ప్రధమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి ప్రమాదంలో చిక్కుకుని మరణించారు.