Hyderabad : రెండు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్

హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు

Update: 2025-07-11 02:45 GMT

తెలంగాణలో ప్రస్తుతుం బోనాల పండగ జరుగుతుంది. దీంతో హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ నెల 13వ తేదీన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. బోనాల పండగ సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా...
జులై పదమూడో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మంగళవరం ఉదయం ఆరు గంటల వరకూ ఉజ్జయిని మహంకాళి జరుగుతను్న ప్రాంతాలైన సికింద్రాబాద్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ లో వైన్ షాపులను బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో వచ్చే ఆదివారం మద్యం అందుబాటులో ఉండదు. ఎవరైనా మద్యం దుకాణాలు తెరిచి విక్రయించినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.


Tags:    

Similar News