Hyderabad : పాతబస్తీ ప్రమాదంలో పదిహేడుకు పెరిగిన మృతుల సంఖ్య

హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది

Update: 2025-05-18 05:53 GMT

హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది. మీర్ చౌక్ లో ఉన్న గుల్జార్ హౌస్ లోని మొదటి అంతస్తులోని ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మృతులందరూ నాలుగు కుటుంబాలకు చెందిన వారని, ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ముత్యాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పొన్నం సందర్శించి...
తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సంఘటనస్థలిని సందర్శించారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అయినా ప్రభుత్వ సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.


Tags:    

Similar News