నమ్రత నమ్మించి మోసం చేశారు : డీసీపీ
సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు ఎలాంటి అనుమతులు లేవని డీపీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు
సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు ఎలాంటి అనుమతులు లేవని డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఆ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ సర్టిపికెట్లకు 2021లో నే గడువు ముగిసందన్న డీసీపీ సంతానం కలగని దంపతులను డాక్టర్ నమ్రత మోసం చేశారని తెలిపారు. డీసీపీ రష్మి పెరుమాళ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు వెళ్లారని, వారికి డాక్టర్ నమ్రత అనేక రకాల పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాాధ్యం కాదని, సరోగసి ద్వారా పొందవచ్చని చెప్పారని తెలిపారు. అందుకు ముప్ఫయి లక్షల ఖర్చు అవుతుందని కూడా నమ్రత వారికి చెప్పారన్నారు.
సరోగసి చేయకుండానే...
సరోగసి కోసం విశాఖకు చెందిన దంపతులను తాను ఒప్పించానని, వారు అందుకోసం ఐదు లక్షలు అడిగారని నమ్రత తెలిపినట్లు డీసీపీ తెలిపారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నామని, అందుకు విశాఖలోని సరోగసి మదర్ ను కూడా చూపించారన్నారు.అయితే నమ్రత సరోగసి చేయకుండానే అస్సోంకు చెందిన మహిళకు చెందిన శిశువును పుట్టగానే తీసుకుని తర్వాత దంపతులకు ఇచ్చారని అన్నారు. ఆ దంపతులకు అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించారని, అప్పుడే ఆ శిశువు తమకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ కాదని తేలిందని డీసీపీ వివరించారు. అన్ని రకాల నిబంధనలను సృష్టి ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు ఉల్లంఘించారని డీసీపీ తెలిపారు.