Hyderabad : నేడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది.

Update: 2025-04-25 02:37 GMT

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కార్పొరేటర్లు,ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు వేశారు.

ఇద్దరు అభ్యర్థులు...
ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో పాటు తక్కువ ఓట్లు కావడంతోమధ్యాహ్నానికే పూర్తయ్యే అవకాశాలున్నాయి. మొత్తం 112 ఓట్లు ఉంటే కేవలం 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీఆర్ఎస్ ఈ పోలింగ్ కు దూరంగా ఉంది.


Tags:    

Similar News