Hyderabad : ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2025-03-28 03:46 GMT

ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డిజిల్లాలో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యా లయాన్ని నానక్‌రాంగూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలోని గచ్చిబౌలి సమీపంలోగల నానక్‌రాంగూడలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసి అక్కడినుంచి ఫ్యూచర్‌సిటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మౌలిక సదుపాయాల కల్పనకు...
ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను కేటాయించింది. హైదరాబాద్ ను విస్తరించి ఉన్న ప్రాంతాలను హైదారాబద్ నగర పరిధిలోకి తీసుకు రావడంతో ఈ ఫ్యూచర్ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.


Tags:    

Similar News