Telangana : నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నేడు జరగనుంది.
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నేడు జరగనుంది. గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై చర్చించనున్నారని తెలిసింది. ప్రధానంగా వరంగల్ లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మరోసారి చర్చ జరిగే అవకాశముంది.
అనేక అంశాలపై...
అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపైన ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుందని తెలిసింది. దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.