హైదరాబాద్ అగ్నిప్రమాదం పై నేడు ప్రాధమిక నివేదిక
హైదరాబాద్ చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై నేడు కమిటీ ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక అందించనుంది
హైదరాబాద్ చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై నేడు కమిటీ ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక అందించనుంది. గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగి పదిహేడు మంది మరణించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం కమిటీ వేసింది. గత నాలుగు రోజులుగా అగ్నిమాపక శాఖ, పోలీసులు, హైడ్రా, విద్యుత్తు శాఖ అధికారులు ప్రమాదం జరిగిన తీరు, అందుకు కారణాలపై విశ్లేషించారు.
అందరినీ విచారించి...
ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. అయితే ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. అక్రమ విద్యుత్తు కనెక్షన్ వాడటం, ఏసీ కంప్రెషర్ పేలడం వల్ల కూడా ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని విచారణలో తేలినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ నివేదిక లో ఏ అంశాలు వివరించనున్నారో తెలియాల్సి ఉంది.