Hyderabad : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. అందుకేనా?

హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చేరుకున్నారు. సీబీఐ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు.

Update: 2025-09-05 08:20 GMT

హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చేరుకున్నారు. సీబీఐ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సీబీఐ విచారణను కోరుతూ శాససనభలో ఆమోదించింది. ఈ మేరకు సీబీఐకి లేఖ రాసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో...
ఈ నేపథ్యంలోనే సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చారా? అన్న కోణంలో చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు సీబీఐ సిద్ధమవుతుందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. అయితే సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చి అధికారులతో సమావేశం కావడంతో కాళేశ్వరంపైనే చర్చించేందుకు అన్న చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News