ఆసుపత్రిలో చేరిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ లో అస్వస్తతకు గురయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరారు.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ లో అస్వస్తతకు గురయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వెంటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అందిన సమాచారం ప్రకారం, శ్రీశైలంనుంచి తిరుగు ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు రావడంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ పర్యటనలో...
ప్రవీణ్ సూద్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పటికీ, ఈ సందర్భంగా సీబీఐ నగర యూనిట్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ సూద్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.