హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది

Update: 2025-05-15 07:58 GMT

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో రాంగ్ రూట్ లో వెళుతన్న బెల్లంకొండ శ్రీనివాస్ కారును ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీసుపై దుర్భాష లాడారు. తాను హీరోనంటూ రాంగ్ రూట్ లో వెళ్లారు.

కానిస్టేబుల్ ను దుర్బాషలాడి...
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను దుర్భాషలాడటంపై హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News