మా ప్రాణాలు పోతున్నాయి కాపాడండి.. బాధితుడి కాల్ రికార్డింగ్
నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో చిక్కుకున్న బాధితుడి కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది
నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో చిక్కుకున్న బాధితుడి కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల నాంపల్లి లోని ఒక ఫర్నీచర్ షాపులో అంటుకున్న మంటల్లో చిక్కుకుని ఆ భవనంలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే లోపల ఉన్న బాధితుడు ఒకరు తమను కాపాడాలంటూ ఫోన్ చేసిన కాల్ రికార్డ్ ఆవేదన తెప్పిస్తుంది.
ఏం కనిపించడం లేదంటూ...
లోపల చిక్కుకున్నాం... ఏమి కనిపించడం లేదు, మేము ముగ్గురం చనిపోతున్నాము, అన్ని మార్గాలు మూసుకుపోయాయి అంటూ భవనం లోపల నుండి బాధితుడు ఫోన్ చేశాడు. మా ప్రాణాలు పోతున్నాయి కాపాడండి కన్నీటి పర్యంతమయ్యాడు. మరణం కంటి ముందే ఉండటంతో వాళ్లు పడిన వేదన ఈ కాల్ రికార్డింగ్ తో బయటపడినట్లయింది.