నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు
బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం సమర్పించునున్నారు. సింగరేణిలో బొగ్గు గనుల కేటాయింపుపై ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణి బొగ్గు గనుల కేటాయింపుకు అవసరమైన టెండర్లలో అవకతవకలు జరిగాయని పెద్దయెత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
బొగ్గు గనుల కేటాయింపులో...
బొగ్గు గనుల కేటాయింపులో ఒక వ్యక్తికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ మిగిలిన వారికి అన్యాయం చేసిందని, అలాగే నిబంధనలను కొత్తవి అమలులోకి తెచ్చి మరీ ఇతరులు ఈ టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరేందుకు బీఆర్ఎస్ నేతలు నేడు నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు